శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (21:46 IST)

మోమోస్ రోజూ కొనిపెట్టని భర్త-పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భార్య.. కౌన్సిలింగ్‌లో?

momos
momos
ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవ జరుగుతోంది. తాజాగా యూపీలోని ఆగ్రాలోని ఓ యువ జంట మోమోస్‌పై గొడవ పోలీసు స్టేషన్‌కు, ఆపై ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తన భర్తతో గొడవపడి ఇంటి నుండి బయలుదేరిన యువతి, తన భర్త తనకు ప్రతిరోజూ మోమోస్ ఇస్తామని హామీ ఇచ్చాడని.. ఆ మాటను ఉల్లంఘించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహానికి ముందు ప్రతిరోజూ తనకు మోమోస్‌ తీసిపెట్టాలని కోరినట్లు తెలిసింది. 
 
పెళ్లికి తర్వాత ఆ భర్త కొన్ని నెలలు అనుసరించిన పద్ధతిని ఆపివేసాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు బదిలీ అయ్యింది. ఈ దంపతులను వారు పిలిపించారు. కౌన్సిలింగ్ కూడా సక్సెస్ అయ్యింది. చివరకు భర్త తన భార్యకు వారానికి రెండుసార్లు మోమోలు కొనిస్తానని హామీ ఇచ్చాడు. ఈ షరతుకు భార్య అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.