మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (21:58 IST)

తమిళనాడులో కొత్తరకం కరోనా వైరస్

తమిళనాడులో తీవ్రస్థాయిలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం కొత్త రకాన్ని సంతరించుకున్నది. తమిళనాడు రాష్ట్రంలో మార్చి నుండి వ్యాప్తిలో వున్న కరోనా వైరస్ లలో ఎ1, ఏ2, ఏ3తో పాటు బి1, బి2 వైరస్‌లు ప్రధానంగా వ్యాప్తిలో వున్నాయి.
 
ఇది కాకుండా ఇప్పుడు మరో కొత్తరకంగా వైరస్ విదేశాల నుండి సోకినట్లు పరిశోధకులు చెపుతున్నారు. దీనిని ఏ13ఐ వైరస్‌గా చెపుతున్నారు. తమిళనాడు మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎ1, ఏ3 రకానికి చెందిన వైరసులు వ్యాప్తిలో వున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

కేరళ రాష్ట్రంలో గుర్తించబడ్డ వైరస్ చైనాలో వూహాన్ నగరానికి చెందినదిగా చెపుతున్నారు. హైదరాబాదులో విస్తరిస్తున్న కరోనా వైరస్ దక్షిణ ఆసియా నుంచి సంక్రమించిందని వెల్లడించారు. ఐతే ఈ వైరస్ మూలం ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం వారు చెప్పలేకపోతున్నారు.