ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (12:40 IST)

కరోనా దవాఖాన కిటికీ నుంచి దూకేసిన మహిళ.. ఎక్కడ?

కరోనాతో ప్రాణాలు కోల్పోయే వారు భారీగానే వున్నారు. కానీ కోవిడ్ సోకిందనే భయంతో, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడేవారు కూడా పెరిగిపోతున్నారు. చాలామంది చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కానీ మరి కొందరు కరోనా వచ్చాక డీలా పడిపోతున్నారు. తాజాగా కరోనాతో చికిత్స పొందుతున్న మహిళ దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా తీర్థంకర్ మహావీర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడిన మహిళను ఇటీవల వైద్య అధికారులు టీఎంఎంయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఉన్నట్టుండి ఆమె దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మహిళ కిటికీలో నుంచి దూకిన దృశ్యాలు వార్డులోని సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను భద్రపరిచామని, కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.