గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2024 (11:39 IST)

కోవిడ్ లాక్‌డౌన్.. చంద్రుడిపై తగ్గిన ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటంటే?

lockdown
ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్ మధ్య గది గోడలకే పరిమితమైన వేళ చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. 
 
లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు. 
 
ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (పీఆర్ఎల్)కు చెందిన శాస్త్రవేత్తలు కె.దుర్గాప్రసాద్, జి.అంబ్లీ నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. 
 
2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది. చంద్రుడిపై మనకు కనిపించే భాగంలోని ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు.