శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (15:13 IST)

రాత్రి ఇంటికొచ్చిన జవాను.. మరో జవానుతో అసభ్య భంగిమలో భార్య

వివాహేతర సంబంధం ముగ్గురి హత్యకుదారితీసింది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు... తన ఇంట్లోని పడక గదిలో తన భార్య మరో జవానుతో సన్నిహితంగా (అసభ్యభంగిమలో) ఉండటాన్ని చూసి నిశ్చేష్టుడైపో

వివాహేతర సంబంధం ముగ్గురి హత్యకుదారితీసింది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆర్మీ జవానుకు... తన ఇంట్లోని పడక గదిలో తన భార్య మరో జవానుతో సన్నిహితంగా (అసభ్యభంగిమలో) ఉండటాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. ఆ తర్వాత తేరుకుని ఆగ్రహోద్రుక్తుడై తన చేతిలోని తుపాకీతో కట్టుకున్న భార్యతో పాటు తప్పుడుపనికి పాల్పడిన జవానును, సదరు జవాను భార్యను కూడా కాల్చి చంపాడు. ఆ తర్వాత నేరుగా తుపాకీతో పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగింది. మూడు హత్యలకు పాల్పడిన జవాను తెలంగాణ రాష్ట్రంలోని పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన జవాను. గురువారం రాత్రి జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టవర్ జిల్లాలో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఏడేళ్ళ క్రితం లావణ్య అనే యువతితో వివాహమైంది. గత మూడేళ్లుగా తాను పని చేసే చోట ఉన్న సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్‌లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో లావణ్యకు తన ఇంటిపక్కనే ఉండే రాజేష్‌తో  వివాహేతరసంబంధం ఏర్పడింది. తన భర్త సురేందర్ విధులకు వెళ్లిన సమయంలో పక్కింటి రాజేష్‌తో శారీరక సుఖం పొందుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఇటీవల సురేందర్ రాత్రి విధులకు వెళ్లి మధ్యలోనే ఇంటికి తిరిగివచ్చాడు. అపుడు తన భార్య పక్కింటి రాజేష్‌తో పడక గదిలో సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. ఆ వెంటనే తనవద్ద ఉన్న తుపాకీతో భార్య లావణ్యను, జవాను రాజేష్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దానికి పక్కింట్లో ఉన్న రాజేష్ భార్య శోభ.. సురేందర్ ఇంటికి వచ్చి చూడగా, తన భర్త రక్తపుమడుగులో పడివుండటం చూసి హతాశురాలైంది. 
 
ఆ తర్వాత తేరుకుని సురేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ కూడా నిర్ధారించారు.