బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 30 అక్టోబరు 2020 (23:05 IST)

ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కోడలు, ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన అత్త

భర్త చనిపోయాడు. పదేళ్ళవుతోంది. తన ఇంటికి పక్కనే ఉన్న తన కన్నా 10 యేళ్ళ తక్కువ వయస్సున్న యువకుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి అత్త మందలించింది. మార్పు రాలేదు. చివరకు ట్రాక్టర్‌తో తొక్కి చంపించేసింది అత్త.
 
మహారాష్ట్ర లోని చపల్ గావ్‌కు చెందిన మరియా తన అత్త ఇంట్లో ఉంటోంది. ఆమెకు 22 యేళ్ళకే వివాహం జరిగింది. వివాహం జరిగిన సంవత్సరానికే భర్త చనిపోయాడు. ఆమె అనాధ కావడంతో అత్తింట్లోనే ఉంటోంది. పది సంవత్సరాల పాటు ఆమె అత్త, మామలతో కలిసి ఉంటోంది. 
 
తోడు లేడు. విరహం తట్టుకోలేకపోయింది. ఇక ఆగలేక కరోనా సమయంలో సరిగ్గా ఆరు నెలల నుంచి ఇంటి పక్కనే ఉన్న ఒక యువకుడితో వివాహేతర బంధాన్ని పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. ఆ యువకుడితో స్కూటర్ పైన చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేది.
 
అత్త మందలించింది. అలా చేయడం తప్పని చెప్పింది. అయినా మరియాలో మార్పు రాలేదు. దీంతో హత్యలు చేసే ముఠాతో బేరం కుదుర్చుకుంది అత్త. ఐదు లక్షలు బేరం కుదుర్చుకుని బైక్ పైన వెళుతున్న మరియా, ఆమె ప్రియుడిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి చంపేసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసే ప్రయత్నం జరిగినా యువకుడి బంధువుల ఫిర్యాదుతో విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. అత్తను, నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.