సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఆర్. సందీప్
Last Modified: బుధవారం, 10 జూన్ 2020 (17:29 IST)

ప్రియుడితో తల్లి రాసలీలలు, చూసిన కుమార్తె తండ్రితో చెప్పడంతో..

భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు రహస్యంగా ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న మహిళ అసభ్యకర రీతిలో కూతురి కంటపడింది. చివరికి భర్త చేతిలో హతమైంది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటకు చెందిన సెల్వం అనే వ్యక్తికి చిత్రతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు, చిత్ర అదే గ్రామానికి చెందిన మరో యువకునితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంటికి రప్పించి రాసలీలలు సాగించేది. ఈ విషయంపై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయినా ప్రవర్తన మార్చుకోని చిత్ర ఆదివారం కూడా భర్త, కూతురు బయటకు వెళ్లినప్పుడు ప్రియుడిని రప్పించుకుంది. 
 
పనిమీద బయటకు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాగా చిత్ర అసభ్యకర రీతిలో కనిపించింది. తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెల్వం డ్యూటీ ముగించుకుని రాత్రి 12 గంటలకు ఇంటికి రాగా కూతురు విషయం మొత్తం తండ్రికి చెప్పింది. దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సెల్వం పెద్ద కర్ర తీసుకుని భార్య తలపై గట్టిగా కొట్టడంతో రక్తం కారుతూ ఆమె క్రింద పడిపోయింది. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఇంటివద్దే ఆమె మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.