ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (09:11 IST)

దేశంలో బంగారం వినియోగం తగ్గుదల!

కొవిడ్‌-19 వల్ల వ్యాపారానికి అవరోధాలు ఏర్పడటం, ధర కూడా బాగా పెరగడంతో పసిడి డిమాండు జూలై-సెప్టెంబర్‌ మధ్య ఇటు దేశంలోనూ, అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది.

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్‌ మధ్య భారత్‌లో డిమాండ్‌ 30 శాతం పడిపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ క్షీణత 19 శాతంగా ఉంది.

సెప్టెంబరు త్రైమాసికంలో భారత్‌ బంగారం డిమాండు పరిమాణంలో 123.9 టన్నుల (2019 సెప్టెంబర్‌) నుంచి 86.6 టన్నులకు పడిపోయింది.

ఇక విలువల ప్రకారం మాత్రం పసిడి డిమాండు 4 శాతం పడిపోయి రూ.41,300 కోట్ల నుంచి రూ.39,510 కోట్లకు తగ్గింది.

ఇక ఆభరణాల డిమాండు, పరిమాణంలో 48 శాతం క్షీణించి 101.6 టన్నుల నుంచి 52.8 టన్నులకు చేరింది. విలువలో చూస్తే, 29 శాతం పడిపోయి, రూ.33,850 కోట్ల నుంచి రూ.24,100 కోట్లకు దిగింది.