1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 జూన్ 2022 (15:06 IST)

ఆకాశంలో విమానంలో చెలరేగిన మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

spicejet
స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగా ఈ విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. పాట్నా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. 
 
ఈ విమానం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఒక్కసారిగా మంటలు అంటుకోవడం కలకలం రేపింది. పాట్నా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ఐన కొద్ది సేపటికే విమానం ఎడమ ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. 
 
దీంతో ఇంజిన్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పైలట్లు.. విమానాన్ని తిరిగి పాట్నా విమానాశ్రయంలో అత్యవరసర ల్యాండింగ్‌ చేశారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
దీనిపై స్పందించిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ).. పక్షి ఢీ కొట్టడం వల్లే మంటలు వచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే ఇంజిన్‌ను ఆపేసిన పైలట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది.