శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (13:15 IST)

ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి.. అందుకే దొంగగా మారిపోయా..

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురమ్మాయిలను మేనేజ్ చేయాలని ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తనకున్న ముగ్గురు స్నేహితురాళ్లను డీల్ చేయాలంటే భారీగా డబ్బు అవసరమని.. వారికి కానుకలు ఇచ్చేందు కోసం ఓ డ్యాన్స్ మాస్టర్‌ దొంగగా మారాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని గోవింద్ పూర్ ప్రాంతానికి చెందిన రోహన్ గిల్ డ్యాన్సర్‌గా పనిచేస్తున్నాడు. 
 
గురువారం ఓ ఆటో డ్రైవర్ వద్ద డబ్బు లాక్కుని రోహన్ పరుగులు తీశాడు. అయితే రోహన్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.2000లతో పాటు మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ జరిపారు. 
 
ఈ దర్యాప్తులో తనకు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ వున్నారని.. వారితో కలిసి తిరిగేందుకు.. చాలినంత డబ్బు లేదని.. అందుకే ఇలాంటి దొంగతనాలకు అలవాటు పడ్డానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో రోహన్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.