బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (10:02 IST)

యూట్యూబ్ ఛానళ్లు.. విద్రోహ శక్తులతో జరజాగ్రత్త: ఇంటలిజెన్స్ వర్గాలు

యూట్యూబ్ ఛానళ్లతో జరజాగ్రత్తగా వుండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మీడియా ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఆ శక్తులు సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

యూట్యూబ్ ఛానళ్లతో జరజాగ్రత్తగా వుండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మీడియా ముసుగులో విధ్వంసం సృష్టించేందుకు ఆ శక్తులు సిద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
యూట్యూబ్ చానల్ ప్రారంభించేందుకు పెద్దగా శ్రమలేకపోవడం, ప్రభుత్వ లైసెన్స్‌లు తదితర వాటితో పనిలేకపోవడంతో ఎవరైనా ఐదే నిమిషాల్లో యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించే అవకాశం ఉంది.. దీంతో చాలామంది యూట్యూబ్‌లో సొంతంగా న్యూస్ చానెళ్లను పెట్టుకుని రిపోర్టర్లుగా మారిపోతున్నారని, ఇంకా డబ్బుకు ఆశపడి వీరు సంఘవిద్రోహ శక్తులకు అమ్మడుపోతే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
కీలకమైన స్థావరాలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని వీరిని ఉపయోగించుకుని తస్కరించే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. యూట్యూబ్ చానెళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.