మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (12:05 IST)

నడుముపై చేయి వేసి, అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధింపులు..

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని బసుల్లో ప్రయాణిస్తుంటే ఓ పోకిరి లైంగికంగా వేధించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వి

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రాత్రిపూటే కాదు పట్టపగలు కూడా భద్రత లేదు. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థిని బసుల్లో ప్రయాణిస్తుంటే ఓ పోకిరి లైంగికంగా వేధించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఢిల్లీకి చెందిన ఓ యువతి ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ యువతి యూనివర్శిటీ నుంచి ఇంటికి వెళ్లేందుకు 774 రూట్ నంబరు బస్సు ఎక్కింది. యువతి కిటికీ పక్కన సీటులో కూర్చొని పుస్తకం చదువుకుంటుండగా పక్కన కూర్చున్న 40 ఏళ్ల ప్రయాణికుడు యువతి నడుముపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించాడు.
 
ఈ విషయాన్ని బస్సులో ఉన్న ప్రయాణికుల దృష్టికి తీసుకెళ్లినా వారిలో ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో యువతి ప్రయాణికుడి వేధిస్తుండగా తన మొబైల్ ఫోన్ కెమెరాతో వీడియో తీసింది. అనంతరం యువతి బస్సులో ప్రయాణికుడి లైంగికవేధింపుల గురించి వీడియో సాక్ష్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పట్టపగలే బస్సులో అసభ్యంగా తాకుతూ వేధించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంలోనూ తాత్సారం చేశారు. దీన్ని ట్విట్టర్‌లోనూ పోస్టు చేసింది. దీంతో కదిలిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ డీసీపీ మోనికా భరద్వాజ్ చెప్పారు.