శుక్రవారం, 17 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (07:36 IST)

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

Sabarimala
Sabarimala
శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకేశాడు. ఈ ఘటనతో ఆలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ వ్యక్తి కర్ణాటక, కన్నపురకు చెందిన కుమార స్వామి (40) అని తేలింది. 
 
శబరిమల సన్నిధానం మల్లికాపురం సన్నిధి నుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలైనాయి. సన్నిధానం ఆస్పత్రి నుంచి కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. అక్కడ చికిత్స ఫలించక కుమారస్వామి ప్రాణాలు కోల్పోయాడు. 
 
అతను పై నుంచి దూకడంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతూ వచ్చిన కుమార స్వామి అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ అకృత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.