సిగరెట్ కాల్చొద్దన్నాడని దివ్యాంగుడిని రైల్లోంచి తోసేశారు...
పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో ఓ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో సిగరెట్ కాల్చొద్దన్నాడనీ ఓ ప్రయాణికుడిని రైల్లోనుంచి కిందికి తోసేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో ఓ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో సిగరెట్ కాల్చొద్దన్నాడనీ ఓ ప్రయాణికుడిని రైల్లోనుంచి కిందికి తోసేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఫరీదాబాద్‌కు చెందిన ఉపేంద్ర ప్రసాద్ (45) సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. దివ్యాంగుల కోసం కేటాయించిన బోగీలో కూర్చున్నాడు. అదే బోగీలోకి ముగ్గురు యువకులు ఎక్కి సిగరెట్ వెలిగించారు. 'దివ్యాంగుల బోగీలోకి ఎక్కడమే కాకుండా పొగ వదలడం ఏంటి?' అని ప్రసాద్ వారిని నిలదీశారు. దీంతో అతడిని బోగీలోంచి బయటకు విరిసేశారు.
ఈ ఘటనంలో ప్రసాద్‌కు తల పగిలి, కాళ్లు, భుజం దోక్కుపోయిన స్థితిలో కొన్ని గంటలపాటు అతడు అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. తెలివిలోకి రాగానే సహాయం కోసం కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవారు చూసి ఆస్పత్రిలో చేర్చారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు... నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.