బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (11:13 IST)

తమిళనాట డీఎంకే హవా!

తమిళనాట అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ తగలబోతోందని ఏబీపీ సీ-ఓటర్‌ సర్వేలో తేలింది. తమిళనాట డీఎంకే హవా. అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని బీజేపీ చేస్తున్న రాజకీయానికి అడ్డుకట్ట! కేరళలో అధికారాన్ని నిలుపుకోనున్న వామపక్ష కూటమి. పుదుచ్చేరిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం.

పశ్చిమబెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని తేలింది. అసోంలో 43 ఓట్ల వాటాతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్స్‌. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో తేలిన విషయాలివి. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే..
 
తమిళనాడు: అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి 58-66 సీట్లు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే నేతృత్వంలోని యూపీఏ కూటమికి 154-162 సీట్లు రావొచ్చు. కమల్‌ పార్టీకి (మక్కల్‌ నీది మయ్యమ్‌) 2-6 సీట్లు వచ్చే అవకాశం.
 
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రె్‌సకు గట్టి దెబ్బ తగలబోతోంది. 17 నుంచి 21 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఈసారి 12లోపు సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
 
కేరళ: దేవభూమిగా పేరొందిన కేరళలో వామపక్ష కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎ్‌ఫ)కు 83 నుంచి 91 సీట్లు వచ్చే చాన్స్‌. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎ్‌ఫకు 47-55 సీట్లు వచ్చే అవకాశం. బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 
 
పశ్చిమబెంగాల్‌: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ 148 నుంచి 164 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టే అవకాశం ఉందని తేలింది. బీజేపీకి 92 నుంచి 108 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది.  కాంగ్రె్‌స-వామపక్ష కూటమికి 31-39 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
 
అసోం : అసోంలో ఎన్డీయే కూటమి 43 శాతం ఓట్లతో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 72సీట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే కూటమి 41ు ఓట్లతో.. 47 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది.