శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఆగస్టు 2020 (10:46 IST)

కాషాయ కండువా కప్పుకున్న పెరియార్ మనవడు..

సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పెరియార్‌ మనవడే సతీశ్ కృష్ణ కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. పెరియార్‌ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదని డీఎంకే వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే, స్వయంగా పెరియార్ మనవడే బీజేపీలో చేరడం డీఎంకేకు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ప్రధానిని ప్రశంసిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 
 
కాగా డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్‌కి రుచించలేదు. దీంతో ఆయనతో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న డీఎంకే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 
త్వరలో సెల్వం కూడా మిగతా ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో పాటు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. సెల్వం ఇప్పటికే బీజేపీ నేతలు మరళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లతో పాటు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలుసుకున్నట్టు సమాచారం.
 
తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీల్లో అసమ్మతి నేతలు తమ పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమం అయ్యిందంటూ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల మొదట్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు.