గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (12:29 IST)

డీఎస్పీని రాళ్ళతో కొట్టి చంపిన ఉగ్రవాది ఎన్‌కౌంటర్...

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపిన ఉగ్రవాదిని ఆ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఉగ్రవాది పేరు సాజిద్ అహ్మ‌ద్ గిల్క‌ర్. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాద సంస

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీని రాళ్లతో కొట్టి చంపిన ఉగ్రవాదిని ఆ రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఉగ్రవాది పేరు సాజిద్ అహ్మ‌ద్ గిల్క‌ర్. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాద సంస్థకు చెందిన సభ్యుడు. గిల్కర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమార్చినట్టు పోలీసులు ప్రకటించారు. 
 
అలాగే, ఈ కేసుకు సంబంధించి 20 మందిని అరెస్టు చేసిన‌ట్లు ఐజీపీ మునీర్ ఖాన్ మీడియాకు తెలియ‌జేశారు. గిల్క‌ర్‌తో పాటు అత‌ని స‌హ‌చ‌రులు ఆఖీబ్ గుల్‌, జావేద్ అహ్మ‌ద్ షేక్‌లు కూడా ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన‌ట్లు ఖాన్ స్ప‌ష్టం చేశారు. 
 
హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయ‌కుడు జాకీర్ ముసాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న‌కారులు మ‌సీదు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో గిల్క‌ర్ బృందం అయూబ్‌పై దాడికి పాల్ప‌డింద‌ని ఖాన్ చెప్పారు. గ‌తంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులపై జ‌రిగిన గ్రెనేడ్ దాడుల్లో కూడా గిల్క‌ర్ హ‌స్త‌ముంద‌ని ఖాన్ తెలిపారు.