మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (15:29 IST)

పొగాకు వినియోగానికి యువత దూరంగా ఉండాలి: నరేంద్ర మోడీ

దేశంలోని యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోందనీ... వాటికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు యువతకు విజ్ఞప్తి చేశారు. 
 
"ఈ-సిగరెట్లు హాని చేయవన్న ఓ అపోహ చాలా మందిలో ఉంది. కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ-సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి ప్రజలు, ప్రత్యేకించి యువత ఈ-సిగరెట్లకు దూరంగా ఉండాలని కోరుతున్నాను" అని కోరారు. కాగా దసరా వేడుకల ప్రారంభం సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విజయాలను వేడుకలా జరుపుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.