బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిన ఈడీ
ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బీబీసీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసిది. ఈ కేసులో ఆర్థిక లావేదేవీల వివరాలను సమర్పించాలని బీబీసీ ఇండియా యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా ప్రసాసుల నుంచి అందిన నిధులు (విదేశీ రెమిటెన్సుల) వివరాలను కూడా వెల్లడించాలని కోరారు.
కాగా, గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ ఒక వివాదాస్పద డాక్యుమెంటరీని రూపొందించి ప్రసారం చేసింది. దీన్ని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీబీసీ ఇండియా కార్యాలయంలో ఈడీ తనిఖీలు మొదలయ్యాయి. ఇది పెద్ద వివాదం కావడంతో ఈడీ వివరణ ఇస్తూత ఇవి సోదాలు కాదు.. వివరణ అంటూ వివరణ ఇచ్చింది.
ఇండియా : ద మోడీ క్వశ్చన్ పేరితో ఈ డాక్యుమెంటరీని రెండు భాగాలుగా తయారు చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్‌చిట్ లభించిన తర్వాత కూడా అభాండాలు వేయడం ఏమిటని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, విపక్ష నేతలు మాత్రం ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా, బీబీసీ ఇండియా ప్రసారం చేసిన డాక్యుమెంటరీని సమర్థిస్తూ వారు ప్రసంగాలు చేశారు.