ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2023 (11:19 IST)

ఇథియోపియా విమానానికి తప్పిన పెను ప్రమాదం - ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

flight
ఇథియోపియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో పొగ వ్యాపించడంతో తిరిగి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా బయలుదేరిన విమానంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే....
 
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్‌‌కు చెందిన ఈటీ687 బోయింగ్‌ 777-8 విమానం 240 మందికిపైగా ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమాన కాక్‌పిట్‌ నుంచి కాలుతున్న వాసన రావడం మొదలైంది. 
 
చూస్తుండగానే కాక్‌పిట్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ గ్రౌండ్‌ కంట్రోల్‌ విభాగానికి సమాచారం అందించి.. విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్‌ పోర్టుకు మళ్లించి అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.