రాజకీయనేత నిజాయితీగా ఉంటే ఎన్నో కష్టాలు : రాహుల్ గాంధీ
'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్వయంగా నేను అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.
గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా పటీదార్లు ఎక్కుగా ఉండే సౌరాష్ట్ర ప్రాంతంలో మంగళవారం రాహుల్ పర్యటించి వారిని ఆకట్టుకునేందుకు యత్నించారు. ఈ సందర్భంగా రాజ్‌కోట్‌లో రాహుల్ మాట్లాడుతూ, నిజాయితీ పరుడైన రాజకీయ నాయకులే అందరికంటే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటారని అన్నారు.
జీఎస్టీని ప్రకటించి వెంటనే.. 'ఇది క్రిమినల్ చర్య' అంటూ మన్మోహన్ చేసిన వ్యాఖ్యలును ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేస్తున్నా. మేం అధికారంలోకి వస్తే రైతులు, ఇతర బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలు ప్రవేశపెడతాం. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ విఫలమైంది. సామాన్య ప్రజలను పక్కనపెట్టి.. ధనిక వర్గాల కోసం బీజేపీ పాకులాడుతోంది. కేవలం ప్రసంగాలకే బీజేపీ నేతలు పరిమితమయ్యారంటూ' రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.