శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (13:01 IST)

ఒకే మొబైల్ ఫోనులో రెండు సిమ్ కార్డులుంటే ఫైన్ కట్టాల్సిందేనా? ఏది నిజం!!

sim cards
ఇపుడు ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక ఫ్యాషన్‌గా కూడా మారిపోయింది. ఆఫీస్‌ కార్యకలాపాల కోసం ఒకటి, వ్యక్తిగత అవసరాల కోసం మరోకటి అంటూ రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇలా రెండు సిమ్ కార్డులు ఉపయోగించే వారు ఇకపై అపరాధం చెల్లించాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ట్రాయ్ ఆదేశాలు జారీచేసినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన చాలా మంది మొబైల్ యూజర్లు నిజమేనని నమ్ముతూ ఆందోళన చెందుతున్నారు. 
 
దీనిపై నిజానిజాలను వెలికి తీయగా, ఇది ఒక తప్పుడు వార్త (ఫేక్ న్యూస్) అని తేలింది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న నంబర్లకు అడ్డుకట్ట వేయాలని మాత్రమే ట్రాయ్ భావిస్తుంది. అంతేకానీ, ఒకే ఫోనులో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న వారికి జరిమానా విధించే ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పింది. అందువల్ల ఒకే ఫోనులో రెండు సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు సిమ్ కార్డులను ధైర్యంగా ఉపయోగించుకోవచ్చని నిజ నిజర్ధారణలో తేలింది.