కేంద్ర మంత్రి అనుప్రియ కారుపై దాడి.. అనుచిత ప్రవర్తన.. 158 మందిపై కేసు
కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కారుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాడి జరిగింది. ఆపై ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిచారు. దీనికి సంబంధించి 158 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రతిప్‌గఢ్ జిల్లాలో పర్యట
కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ కారుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాడి జరిగింది. ఆపై ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిచారు. దీనికి సంబంధించి 158 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె ప్రతిప్‌గఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ దాడిపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ దాడికి సంబంధించి "స్థానిక నేత వినోద్ దూబే, మరో 157 మందిపై కేసు పెట్టాము. వీరంతా గత రాత్రి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, అప్నాదళ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న రోడ్ షోపై దాడికి దిగారు. మంత్రితో అనుచితంగా ప్రవర్తించారు. ఈ మేరకు, వారి ఫిర్యాదు మేరకు కేసు పెట్టాం" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ దూబే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అనుప్రియా మాత్రం దాడి అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ కుట్రేనని ఆరోపించారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల ఇప్పటి నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే.