శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (16:10 IST)

కారులో జంట... మహిళను ఫాంహౌజ్‌కి తీస్కెళ్లి గ్యాంగ్ రేప్...

పంజాబ్ లూథియానాలో శనివారం నాడు జరిగిన ఓ ఘటన పోలీసు వ్యవస్థ పనితీరుని ప్రశ్నించేలా చేసింది. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓ జంట కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వి కారును ఆపారు. ఆపై వారిద్దరినీ అపహరించిన దుండగులు వారిని తీవ్రంగా కొట్టి, మహిళపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ముందుగా కారులో నుంచి జంటను బయటకు లాగి సమీపంలో ఉన్న ఫాంహౌజ్‌కి తీసుకెళ్లారు. కారులో ఉన్న వ్యక్తిని చితకబాది రూ.2 లక్షల రూపాయల ఇవ్వవలసిందిగా బెదిరించారు. వెంటనే ప్రాణాలను రక్షించుకునేందుకు స్నేహితునికి ఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. బాధితుడి స్నేహితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. 
 
అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకోకపోవడంలో నిందితులు మరో ఏడుగురిని అక్కడికి పిలిపించి మరీ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో పోలీసులు విఫలం కావడం వల్లే ఇలా జరిగిందని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సదరు బాధిత జంట పేర్కొంది.