శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (18:30 IST)

సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది...?

1. చీకట్లోనే నక్షత్రాలు కనబడుతాయి..
అలానే కష్టాల్లోనే సత్యాలు గోచరమవుతాయి.. 
 
2. కాలి కింద ఉంది కదా అని.. ధూళిని చులకనగా చూడకు..
కళ్లలో పడినప్పుడే తెలుస్తుంది.. దాని సత్తా ఏంటో..
 
3. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి..
ఎందుకంటే.. వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే..
 
4. మనం మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే..
మనం చేసే పని అంత ఉత్తమంగా అవుతుంది..
 
5. సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది...
కానీ, దాని ఫలితాలెప్పుడూ తియ్యగానే ఉంటాయి..