శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (11:05 IST)

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టిన లారీ.. ఏమైందో తెలుసా?

Ganguly
Ganguly
పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు ఒక కార్యక్రమం కోసం వెళుతుండగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కారును  లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగూలీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ సంఘటన జరిగింది. సౌరవ్ గంగూలీ కాన్వాయ్‌ను లారీ ఓవర్‌టేక్ చేసింది. 
 
అతివేగంగా వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేయడంతో కారు డ్రైవర్ త్వరగా బ్రేక్ వేయవలసి వచ్చింది. దీంతో గంగూలీ కారుతో పాటు ఆ కారు వెనుక ఉన్న వాహనాల ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాటిలో ఒకటి గంగూలీ కారును ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. భారత మాజీ కెప్టెన్ బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి వెళ్లే ముందు రోడ్డుపై దాదాపు 10 నిమిషాలు వేచి ఉన్నాడు. 
 
తరువాత, బీసీసీఐ అధ్యక్షుడు షెడ్యూల్ చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. గంగూలీ రోడ్డు ప్రమాదం ఘటన నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. గాయాలేమీ లేవని తెలియరావడంతో ఊపిరి పీల్చుకున్నారు.