శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (21:22 IST)

అబ్దుల్ కలాం పెద్దన్న మొహ్మద్ ముత్తు మీరా కన్నుమూత

మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు మొహ్మద్ ముత్తు మీరా లెబ్బాయ్ మరైకియార్ కన్నుమూశారు. ఆయన వయస్సు 104 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం రామేశ్వరంలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.