శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జూన్ 2017 (17:18 IST)

Azam Khan పిలుపు: సైనికులు అత్యాచారాలకు పాల్పడితే వారి మర్మాంగాలను కోసివేయాలి

మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పిలుపు నిచ్చారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆజంఖాన్ ఈసారి సైనికులపై పడ్డారు. అత్యాచారాలకు

మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పిలుపు నిచ్చారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఆజంఖాన్ ఈసారి సైనికులపై పడ్డారు. అత్యాచారాలకు పాల్పడే సైనికులపై ప్రతీకార చర్యలకు దిగాలన్నారు. అంతటితో ఆగకుండా వారి మర్మాంగాలను కోసివేయాలన్నారు. 
 
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆజంఖాన్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల దారుణాలు పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చారు. 60 ఏళ్ల తర్వాత భారతదేశం దారి తప్పిందని కామెంట్లు చేశారు. బ్యాలెట్ వదిలి, బుల్లెట్ విధానాన్ని ఎంచుకుందని చెప్పారు. జార్ఖండ్‌, అస్సోం, కాశ్మీర్ రాష్ట్రాల్లో మహిళలపై సైనికుల లైంగిక వేధింపులు శృతి మించాయని ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. 
 
అలాంటి సైనికులను వదిలిపెట్టకూడదని, చితకబాదాలని ఆజంఖాన్ మహిళలకు పిలుపునిచ్చారు. కాగా సైనికులపై ఘాటుగా విమర్శలు గుప్పించిన ఆజం ఖాన్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో చోటు దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో ఆజంఖాన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.