ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 6 మే 2017 (20:18 IST)

ముంబై నగరానికి ఫ్రీ వైఫై ఇస్తే ఏం చేస్తున్నారో తెలుసా?

అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినపుడు అమృతం వచ్చే ముందు ఎన్నో వచ్చాయి. వాటితో పాటు విషం కూడా వచ్చింది. ఇప్పటి పరిస్థితి కూడా అలాగే వుంటోంది. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని డిజిటల్ ఇండియాలా మార్చాలని కలలు కంటున్నారు. దీనికితోడు పలు రాష్ట్రాలు కూడా అంతే వ

అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినపుడు అమృతం వచ్చే ముందు ఎన్నో వచ్చాయి. వాటితో పాటు విషం కూడా వచ్చింది. ఇప్పటి పరిస్థితి కూడా అలాగే వుంటోంది. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని డిజిటల్ ఇండియాలా మార్చాలని కలలు కంటున్నారు. దీనికితోడు పలు రాష్ట్రాలు కూడా అంతే వేగంతో స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ముంబై నగర వాసులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది. 
 
నగరంలో మొత్తం 500 ప్రాంతాలకు పైగా ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించారు. ఈ ప్రాంతాల్లో నివాసముంటున్న 3 లక్షల మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఐతే వీరిలో 10 శాతానికి పైగా ఉచిత వైఫైను ఉపయోగించుకుంటూ పోర్న్ చిత్రాలను చూస్తున్నారట. 
 
రాత్రనకా పగలనగా తేడా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు అదే పనిలో నిమగ్నమైపోతున్నారట. ఈ పోర్న్ వీడియోలను అప్ చేసే సైట్లను బ్లాక్ చేస్తున్నప్పటికీ కొత్త కొత్త సైట్ల ద్వారా మళ్లీ వాటిని చూసేస్తున్నారట 30 వేలమంది. ఈ నేపధ్యంలో పోర్న్ బెడద ఎలా వదిలించుకోవాలన్నది మహా ఐటీ శాఖకు పెద్ద సవాలుగా మారిందట.