బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (13:55 IST)

ఉత్తరప్రదేశ్.. సమోసాలో కప్ప కాలు.. షాకైన కస్టమర్

samosa
ఆహార పదార్థాల్లో కల్తీ, అశుభ్రతకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో తయారు చేసే ఆహారంలో నాణ్యత లోపించిన వీడియోలు ఎన్నో వున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కస్టమర్ కొనుగోలు చేసిన సమోసాలో కప్ప కాలు వుండటం గమనించి ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌కు చెందిన ఓ స్వీట్ స్టాల్‌లో ఓ కస్టమర్ సమోసాను కొనుగోలు చేశాడు. దాన్ని విప్పి చూసి షాకయ్యాడు. అందులో కప్పకాలు వుండటం గమనించి ఆ వ్యక్తికి వాంతులు చేసుకున్నంతలా పరిస్థితి తయారైంది. 
 
ఈ ఘటనపై కస్టమర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పుఢ్ సేఫ్టే అధికారులు సమోసా శాంపిల్స్ పరీక్షలు పంపారు.