సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (12:21 IST)

ఎక్సైజ్ పాలసీ స్కామ్‌- అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

arvind kejriwal
ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు రూ.10 లక్షల బెయిల్ బాండ్, ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. 
 
కేసు మెరిట్‌లపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేజ్రీవాల్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరుతో పాటు సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్‌ చేయడంతో పాటు బెయిల్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 
 
లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.