ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (15:11 IST)

సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా.. తిన్న వారంతా వాంతులు

samosa
పూణెలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటిన్ సమోసాల్లో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు రావడంతో ఉద్యోగులు వాంతులు చేసుకున్నారు. దీనిపై సమోసాలు సప్లై చేసిన కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో క్యాటరింగ్ కంపెనీకి వెళ్లి విచారించిన పోలీసులు ఇదంతా ఆ కంపెనీ మాజీ ఉద్యోగుల నిర్వాకమని తేల్చారు.

ఉద్యోగంలో నుంచి తొలగించారనే కోపంతో  క్యాటరింగ్ కంపెనీకి చెడ్డపేరు తేవాలని ఈ పని చేసినట్లు తేలింది. దీంతో మాజీ ఉద్యోగులు ముగ్గురితో పాటు ఈ నిర్వాకానికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.

దీనికి కారణమైన ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ ప్రతీకార స్టోరీ మొత్తం బయటపడింది.