శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (13:28 IST)

గౌరీ లంకేశ్‌ హత్య కేసులో పురోగతి : నిందితుల చిత్రాలు విడుదల

బెంగుళూరులో హత్యకు గురైన సీనియర్‌ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో సిట్ అధికారుల బృందం కొంతమేరకు పురోగతి సాధించారు. ఈ హత్యకేసులో ఇద్దరు కీలక నిందితులను గుర్తించింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచల

బెంగుళూరులో హత్యకు గురైన సీనియర్‌ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో సిట్ అధికారుల బృందం కొంతమేరకు పురోగతి సాధించారు. ఈ హత్యకేసులో ఇద్దరు కీలక నిందితులను గుర్తించింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే. 
 
ఈ హత్యలోని మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సుమారు 200-250 మందిని విచారించిన సిట్‌ మూడు ఊహాచిత్రాలను రిలీజ్‌ చేసింది. హత్య జరిగిన సుమారు నెల రోజుల తర్వాత అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేయడం గమనార్హం. 
 
తమకు అందిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితుల స్కెచ్‌లను రూపొందించామని కర్ణాటక ఇంటిలిజెన్స్‌ ఐజీపీ బీకే సింగ్ వెల్లడించారు. హత్యకు ముందు అనుమానుతులు నిర్వహించిన రెక్కికి సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని, దానిని కూడా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. తాము  మూడు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.