గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:43 IST)

అదానీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ.. ఏం జరుగుతోంది?

sarad pawar
అదానీ గ్రూపు అధిపతి గౌతం అదానీతో ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ భేటీ అయ్యారు. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా హిండన్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఉద్దేశ్యపూర్వకంగానే అదానీ గ్రూపు కంపెనీ తమ కంపెనీ షేర్లను అధిక ధరకు చూపించిందని వెల్లడించింది. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు కంపెనీల వ్యవహారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో గౌతం అదానీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ భేటీకావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. పైగా, గౌతం అదానీకి ఆయన అండగా నిలిచారు. హిండన్‌బర్గ్ నివేదికను తోసిపుచ్చారు. జేపీసీ స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందంతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బహిర్గతమవుతాయని పవర్ అంటున్నారు. పైగా, పార్లమెంట్‌లో బీజేపీ అధిక సంఖ్యాబలం ఉందని, అందువల్ల జేపీసీ ఇచ్చే నివేదికలో పారదర్శకత ఉండబోదని శరద్ పవార్ అభిప్రాయపడుతున్నారు.