సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (18:51 IST)

ముంబైలో తొలిసారి గే రాకెట్ గుట్టు రట్టు: ముగ్గురు యువకుల అరెస్ట్

ముంబైలో తొలిసారిగా గే సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్ గే యాప్ 'గ్రైండర్' ద్వారా ఈ ముఠా సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
 
ఈ ముఠా వీడియోలు తీసి పలువురిని బ్లాక్‌మెయిల్ చేసేది. ఐదుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి డబ్బులు, కార్డులు లాక్కున్నారని, అతనిపై అభ్యంతరకర వీడియో కూడా తీశారని ఫిర్యాదు అందిందని మల్వానీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హసన్ ములానీ తెలిపారు. 
 
ఈ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ 24 నుంచి 26 ఏళ్ల లోపు వారే. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.