శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 జనవరి 2022 (17:33 IST)

పరువు నష్టం దావా వేసిన సల్మాన్ ఖాన్

ఓ వ్యక్తిపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తక్షణం తొలగించాలని లేదా బ్లాకే చేయాలని ఆయన కోర్టును కోరారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలతో తన పరువు తీస్తున్నారని సల్మాన్ ఖాన్ వాపోతున్నారు. ఈ మేరకు ఆయన ఓ కోర్టుకు ఫిర్యాదు చేశారు. 
 
పన్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సమీపంలో ఉండే వ్యక్త కేతన్ కక్కడ్‌పై సల్మాన్ ఖాన్ ముంబై  సిటీ సివిల్ కోర్టులో తన తరపు న్యాయవాదులతో ఫిర్యాదు చేయించారు. ఆయా మాధ్యమాల్లో సల్మాన్‌కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేలా లేదా బ్లాక్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సల్మాన్ న్యాయబృందం కోర్టును కోరింది. 
 
గతంలో కేతన్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సల్మాన్‌ను కించపరిచేలా మాట్లాడారు. ఇవి సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీంతో సల్మాన్‌కు వ్యతిరేకంగా అన్ని సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వారు కోరారు.