శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (08:45 IST)

కరోనా టీకా వేసుకుంటే.. ఆస్తి పన్నులో బంపర్ ఆఫర్

కరోనా వైరస్ వేయించుకుంటే ఆస్తి పన్ను చెల్లింపులు రిబేట్ ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం టీకాలు వేస్తోంది. 
 
చాలా మంది జనం టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
 
రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు కార్పొరేషన్‌ ఆమోదం కోసం సర్క్యులర్‌ జారీ చేసినట్లు తెలిపారు. 
 
ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని తెలిపారు. సర్క్యులర్‌ తక్షణం అమలులోకి వస్తుందని, జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు.