గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (12:56 IST)

అమ్మకానికి అమ్మాయిలు... మహిళలు ఎక్కడ...?

woman
రాజస్థాన్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాతాల్లో అమ్మాయిలు, మహిళలు అమ్మకానికి ఉంచుతున్నారు. తీసుకున్న అప్పు చెల్లించని పక్షంలో బాలికలు, గృహిణులను అమ్ముకోవాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పు చెల్లించలేని పక్షంలో తమ ఇళ్లలో ఉన్న అమ్మాయిలు, మహిళలను అమ్మేయాలంటూ గ్రామ పంచాయతీ పెద్దలే ఆదేశాలు జారీచేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 
 
హిందీ జాతీయ పత్రిక దైనిక్ భాస్కర్ బహిర్గతం చేసిన కథనం మేరకు... రాష్ట్రంలోని భిల్వారా తదితర ప్రాంతాల్లోని కొన్ని కులాల ప్రజలు వివాదాల పరిష్కారానికి పోలీస్ స్టేషన్లకు వెళ్లడంలేదు. కుల పెద్దలను ఆశ్రయిస్తున్నారు. 
 
ఒక కేసులో రూ.15 లక్షల రుణం చెల్లించనందుకు సోదరిని విక్రయించాలంటూ కుల పెద్దలు తీర్పునిచ్చారు. 
 
ఆ తర్వాత అతడి 12 యేళ్ళ బాలికను కూడా వేలం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కథనం సంచలనం రేపింది. దీంతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక తమకు సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.