శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (11:05 IST)

పీవీ సన్నిహితుడు... వివాదాస్పద చంద్రస్వామి ఇకలేరు...

వివాదాస్పద స్వామిగా పేరు పొందిన చంద్రస్వామి ఇకలేరు. మూత్రపిండాలు చెడిపోవడంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 70 యేళ్లు. గతకొంతకాలంగా డయాలసిస్ తీసుకుంటున్న చంద్రస్వామికి మంగళవారం గుండెపోటు రావడంతో పలు శ

వివాదాస్పద స్వామిగా పేరు పొందిన చంద్రస్వామి ఇకలేరు. మూత్రపిండాలు చెడిపోవడంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 70 యేళ్లు. గతకొంతకాలంగా డయాలసిస్ తీసుకుంటున్న చంద్రస్వామికి మంగళవారం గుండెపోటు రావడంతో పలు శరీర భాగాలు చికిత్సకు సహకరించపోవడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. 
 
కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన స్వామి ఆ తర్వాత పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఆయనను మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. నిజంగా చెప్పాలంటే పీవీకి చంద్రస్వామి ఆధ్యాత్మిక సలహాదారు. 1991లో పీవీ ప్రధాని అయ్యాక ఢిల్లీ కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియాలో 'విశ్వ ధర్మయతన్ సనాతన్' పేరుతో చంద్రస్వామి ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. 
 
బ్రూనే, బహ్రాన్ సుల్తాన్‌కు, నటి ఎలిజిబెత్ టేలర్, బ్రిటిష్ ప్రదాని మార్గరెట్ థాచర్, ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గి, నేరప్రపంచ సామ్రాట్ దావూద్ ఇబ్రహీం తదితరులకు ఆయన ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేవారని చెబుతారు. ఆయనపై వచ్చిన వివాదాలకూ కొదవలేదు. విదేశీ మారకద్రవ్య రెగ్యులేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించారనే కారణంగా 2011 జూన్‌లో సుప్రీంకోర్టు ఆయనకు రూ.9 కోట్లు ఫైన్ వేసింది. ఈయన అసలు పేరు నేమి చంద్.