ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (11:05 IST)

గుజరాత్ సీఎం విజయ రూపానీ విజయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజయం సాధించారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కంటే బాగా వెనుకబడిపోయారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విజయం సాధించారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఆరంభంలో ఆయన తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కంటే బాగా వెనుకబడిపోయారు. 
 
కానీ, ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి ఆయన పుంజుకుని విజయం సాధించారు. దీంతో గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మళ్లీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈయన రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ స్థాన నుంచి విజయం సాధించారు. 
 
కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ 105, కాంగ్రెస్ 74, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 182 సీట్లకు గాను ప్రభుత్వ ఏర్పాకు 92 సీట్లు కావాల్సి ఉంది.