గుజరాత్ పోల్స్ రిజల్ట్స్ : బీజేపీ హవా... ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ కౌంటింగ్‌లో బీజేపీ ఏకంగా 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ కౌంటింగ్‌లో బీజేపీ ఏకంగా 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 65 చోట్ల, ఇతరులు ఒక్క స్థానంలో కొనసాగుతున్నారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాంధీ నగర్ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అశోక్ కుమార్ పటేల్ ముందంజలో ఉండగా, రాధాన్‌పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ ఆధిక్యంలో ఉన్నారు.
అబ్దాసలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రద్యుమన్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. అంజర్ సెగ్మెంట్‌లో బీజేపీ అభ్యర్థి అహిర్ గోక్లాబాయ్, పటాన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిరిట్ కుమార్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. విశావదర్, పోర్ బందర్, కుటియానా, మంగ్రోల్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.