శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (07:15 IST)

#HimachalElection2017 : ఫలితంపై ఎవరి ధీమా వారిదే...

హిమాలయా ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హిమాలయా ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 68 స్థానాలు కలిగిన హిమాచల్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 35 సీట్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో అధికారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. 
 
గత 24 యేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఆ వరుసలో ఈసారి అవకాశం తమకే వస్తుందని, ఎగ్జిట్‌పోల్స్‌లో కూడా అదే తేటతెల్లమైందని బీజేపీ చెబుతోంది. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నేతృత్వంలో తాము మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తంచేస్తోంది. 
 
నవంబర్ 9న జరిగిన ఎన్నికల్లో 75.28శాతం పోలింగ్‌ నమోదుకాగా, ఓట్ల లెక్కింపును మాత్రం 40 రోజుల తర్వాత ఈసీ చేపట్టనుంది. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో 47 బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేశాయి. 
 
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులవడం ఖాయం. ఓటరు నాడి పూర్తిగా భిన్నంగా ఉన్నది. మేం రెండోపర్యాయం అధికారంలోకి రాబోతున్నాం అని సీఎం వీరభద్రసింగ్ తెలిపారు. కాగా, 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36 సీట్లు సాధించి అధికారపీఠాన్ని అధిరోహించింది. ఈ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు 42 కేంద్రాల్లో జరుగనుంది. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.