గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 13 మే 2017 (15:15 IST)

దారుణం... మహళపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్... దేహాన్ని ముక్కలుగా నరికి...

మహిళలపై కామాంధుల దాడి రోజురోజుకీ పెచ్చరిల్లిపోతోంది. నిర్భయ చట్టం తెచ్చినా వారి ఆగడాలకు అంతే లేకుండా వుంది. ఇటీవలే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించినా కామాంధుల్లో ఎంతమాత్రం భయం కలుగడం లేదు. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాత

మహిళలపై కామాంధుల దాడి రోజురోజుకీ పెచ్చరిల్లిపోతోంది. నిర్భయ చట్టం తెచ్చినా వారి ఆగడాలకు అంతే లేకుండా వుంది. ఇటీవలే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించినా కామాంధుల్లో ఎంతమాత్రం భయం కలుగడం లేదు. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో వెలుగుచూసింది. 
 
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... విధులకు వెళుతున్న ఓ యువతిని ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను ముక్కముక్కలుగా నరికేశారు రాక్షసులు. ఇంకా ఆమె ముఖం కూడా గుర్తుపట్టకూడదని ముఖంపై వాహనాన్ని నడిపి ఛిద్రం చేశారు. 
 
దారుణ స్థితిలో వున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మే 9న ఘటన జరుగ్గా ఆ శవం ఎవరిదన్నది తెలుసుకునేందుకు పోలీసులకు మూడు రోజులు పట్టింది. కనిపించకుండా పోయిందన్న కేసుల ఆధారంగా ఆ మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన ఏడుగురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.