శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (14:50 IST)

గోవాలో మే 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన

amit shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 3న గోవాలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ గోవా యూనిట్ అధ్యక్షుడు సదానంద్ తనవాడే మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తర గోవాలోని మపుసాలో జరిగే సమావేశంలో అమిత్ షా ప్రసంగిస్తారని చెప్పారు. 
 
"గత శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో మాకు మంచి మద్దతు లభించింది. మే 3వ తేదీన మపుసాలో జరిగే అమిత్ షా సమావేశానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని తనవాడే చెప్పారు. 
 
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉత్తర గోవా నుండి కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ మరియు దక్షిణ గోవా నుండి పారిశ్రామికవేత్త పల్లవి డెంపోను పోటీకి దింపింది. లోక్‌సభ మూడో దశ ఎన్నికలలో కోస్తా రాష్ట్రంలో మే 7న పోలింగ్ జరగనుంది.