బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

'సీక్రెట్ సన్' కోసం రెయింబవుళ్లూ శ్రమించిన హనీప్రీత్ - డేరా బాబా

సాధ్వీలపై అత్యాచారం కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా చీఫ్ గుర్మీత్‌ రాంరహీం సింగ్‌, హనీప్రీత్‌ సింగ్‌ గురించి రోజుకొకరహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్‌, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని క

సాధ్వీలపై అత్యాచారం కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా చీఫ్ గుర్మీత్‌ రాంరహీం సింగ్‌, హనీప్రీత్‌ సింగ్‌ గురించి రోజుకొకరహస్యం వెలుగులోకి వస్తోంది. గుర్మీత్‌, హనీప్రీత్ రహస్యంగా సంతానం కలిగి ఉండాలని కోరుకున్నారట. తమకు కొడుకు పుడితే.. డేరా స్వచ్ఛ సౌదాకు అతన్ని వారసుడిగా కొనసాగించవచ్చునని భావించారట. కానీ, వారి రహస్య వారసుడి ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదని డేరా ఫాలోవర్లు చెప్తున్నారు. గుర్మీత్‌, హనీప్రీత్‌ మధ్య రహస్య అనుబంధం గురించి వారు పలు విస్మయకర వాస్తవాలను తెలిపారు.
 
తమకు కొడుకు పుట్టాలని, అతన్ని డేరా సామ్రాజ్యానికి వారసుడిని చేయాలని వారు భావించారు. గుర్మీత్‌ సొంత కొడుకు జస్మీత్‌ సింగ్‌ను డేరా వారసుడిగా ప్రకటించాలన్న వాదనను హనీప్రీత్‌ ఒప్పుకునేది కాదని, తమ కొడుకుకే వారసత్వ పట్టాం కట్టాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని గుర్మీత్‌ మాజీ శిష్యుడు గురుదాస్‌ సింగ్‌ తోర్‌ తాజాగా ఆరోపించారు. 
 
తాజా పరిణామాల నేపథ్యంలో వీరి వారసుడి ప్రయత్నాలకు బ్రేక్‌ పడిందని తెలిపారు. ఈ కేసులోని సాక్షుల్లో ఒకరైన తోర్‌.. గుర్మీత్ ‌- హనీప్రీత్‌ అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇద్దరూ డేరాలో భార్యాభర్తల్లాగే గడిపేవారని చెప్పాడు. ఇదే విషయాన్ని హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్‌ గుప్తా సైతం పేర్కొన్న సంగతి తెలిసిందే. డేరాలోని ప్రైవేటు చాంబర్‌లో గుర్మీత్‌-హనీప్రీత్‌ శృంగారానికి పాల్పడే వారని, ఆ సమయంలో డేరా బయట తాను వేచి ఉండే వాడినని గుప్తా గతంలో మీడియాకు వెల్లడించాడు.