శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (13:16 IST)

#farmersprotest ఢిల్లీలో యువ రైతు ఆ పని చేశాడు.. వీడియో వైరల్

#farmersprotest
ఢిల్లీలో రైతులు ఆందోళనకు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా వీళ్లు దేశ రాజధానిలో ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరిని ఢిల్లీలోకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు వీరిపైకి టియర్ గ్యాస్‌, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు. అయితే ఈ వాటర్ కెనాన్‌ల నుంచి రైతులను రక్షించడానికి ఓ యువ రైతు ఏకంగా వాటర్ కెనాన్ వాహనంపైకి ఎక్కి దానిని బంద్ చేశాడు. 
 
అలా చేసినందుకు ఇప్పుడు పోలీసులు ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం గమనార్హం. సోషల్ మీడియా మొత్తం అతన్ని ఓ హీరోగా చూస్తుంటే.. పోలీసులు మాత్రం ఇంత కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంటుంది. పంజాబ్‌కు చెందిన ఆ 26 ఏళ్ల నవ్‌దీప్ సింగ్ అనే రైతు పోలీసుల తీరుపై మండిపడుతున్నాడు. ఇతడు ఓ రైతుల సంఘం అధ్యక్షుడైన జై సింగ్ కుమారుడు. తాను చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడలేదని నవ్‌దీప్ సింగ్ అంటున్నాడు.
 
ఆ జల ఫిరంగులు రైతులను గాయపరుస్తున్నాయన్న ఉద్దేశంతోనే తాను వాటిని ఆఫ్ చేసినట్లు చెప్పాడు. అయితే మొదటి నుంచీ రైతుల పట్ల హర్యానా, ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.