శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (13:53 IST)

అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తాం : బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

తాము అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని వెస్ట్ బెంగాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజు బెనర్జీ హెచ్చరించారు. ఒక‌వేళ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే పోలీసుల‌తో బూట్లు నాకిస్తాన‌ని అన్నారు. రాష్ట్రంలో గూండారాజ్‌ను అంతం చేయ‌డానికి పోలీసులు ఏమీ చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 
 
ఈ రోజుల్లో బెంగాల్‌లో ఏం జ‌రుగుతోందో చూడండి. ఇదే గూండారాజ్ బెంగాల్‌లో కొన‌సాగుతుందా? పోలీసులు అస‌లు ఎలాంటి సాయం చేయ‌డం లేదు. ఇలాంటి పోలీసుల‌తో ఏం చేస్తాం? వాళ్ల‌తో బూట్లు నాకిస్తా అని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కూడా అయిన రాజు బెన‌ర్జీ అన్నారు. 
 
2021లో బెంగాల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ను బీజేపీ నేత‌లు త‌ర‌చూ తెర‌పైకి తెస్తున్నారు. బెంగాల్‌లో మ‌హిళ‌ల‌కు అస‌లు ర‌క్ష‌ణ లేద‌ని బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాష్ విజ‌య్‌ వ‌ర్గియా కూడా ఆరోపించారు. ఓ మహిళ ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేక‌పోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.