గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (10:26 IST)

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగ్... సుప్రీంలో పిటిషన్

supreme court
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఓ బావిలో శివలింగం వెలుగు చూసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతంలో వీడియోగ్రఫీ సర్వే చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ మహిళల తరపు న్యాయవాది వెంటనే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా సీల్ చేశారు. ఈ మేరకు వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ కమాండెంట్‌ను సివిల్ జడ్జి రవికుమార్ దివాకర్ ఆదేశించారు
 
ఇదిలావుంటే, సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. దీంతో సర్వత్వా ఆసక్తి నెలకొంది.