బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Modified: బుధవారం, 7 జూన్ 2017 (19:03 IST)

డబ్బులు మేసేసిన మేక... రూ.66వేల కరెన్సీ నోట్లు, రైతు కుయ్యోమొర్రో

ఆకులు, అలములు తిని బతికే మేక ఒక్కసారిగా కరెన్సీ నోట్లను నమిలి తినేసింది. ఆధునిక యుగంలో ఆవులు, గేదెలు పేపర్లు తింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో.. మేక కూడా ఆకలిని భరించలేక తన యజమాని ప్యాంటులోని కరెన్సీ నోట్లతో కడుపు నింపుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ

ఆకులు, అలములు తిని బతికే మేక ఒక్కసారిగా కరెన్సీ నోట్లను నమిలి తినేసింది. ఆధునిక యుగంలో ఆవులు, గేదెలు పేపర్లు తింటున్న ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో.. మేక కూడా ఆకలిని భరించలేక తన యజమాని ప్యాంటులోని కరెన్సీ నోట్లతో కడుపు నింపుకుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో సంభవించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణ పనుల కోసం సర్వేష్ కుమార్ అనే రైతు తన ప్యాంటు జేబులో రూ.66వేలను ఉంచాడు. అవన్నీ రూ.2వేల రూపాయల నోట్లే. అయితే ఆకలితో మేక ఆ నోట్లను తినేస్తుంటే గమనించిన రైతు షాక్ అయ్యాడు. మేక నోట్లో నుంచి వాటిని బయటకు లాగే ప్రయత్నం చేశాడు. రెండు నోట్లు మాత్రమే బయటకు వచ్చాయి. అవి కూడా బాగా చిరిగిపోయి ఉన్నాయి.
 
స్నానం చేసేందుకు ప్యాంటును పక్కనబెట్టానని.. పేపర్లు తినే అలవాటున్న తన మేక.. రూ.66వేలను నమిలి మింగేసిందని బావురమన్నాడు. కానీ ఆ మేకను తాను తన బిడ్డలా పెంచుకోవడంతో దాన్ని ఏమీ చేయలేనని.. డబ్బుపోయిందని బాధపడటం వరకే చేస్తానన్నాడు. ప్రస్తుతం ఆ మేక సెలెబ్రిటీ అయిపోయింది. ఆ  ప్రాంతం వారు దాంతో సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.