శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (11:41 IST)

డేరా బాబా ఆశ్రమంలో వయాగ్రా పొట్లాలను చూశాను: రాఖీ సావంత్

బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ డేరా బాబాపై నిజాలు బయటపెట్టింది. డేరా బాబా లీలలన్నీ తనకు ముందే తెలుసునని రాఖీసావంత్ వెల్లడించింది. ఓసారి డేరా బాబా ఆశ్రమానికి వెళ్లానని తెలిపింది. అందులోకి వెళ్ళినప్పుడ

బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ డేరా బాబాపై నిజాలు బయటపెట్టింది. డేరా బాబా లీలలన్నీ తనకు ముందే తెలుసునని రాఖీసావంత్ వెల్లడించింది. ఓసారి డేరా బాబా ఆశ్రమానికి వెళ్లానని తెలిపింది. అందులోకి వెళ్ళినప్పుడు తనకు వయాగ్రా పొట్లాలు కనిపించాయని తెలిపింది. అప్పుడే తనకు డేరా బాబా, హనీప్రీత్ లీలలు తెలిశాయని చెప్పింది. అప్పుడే వారి చీకటి సామ్రాజ్యపు లీలలను బయటపెట్టాలని భావించానని చెప్పింది. 
 
డేరాబాబాపై తీస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరించిన సందర్భంగా రాఖీ సావంత్ మాట్లాడుతూ.. ఢిల్లీ శివార్లలో నిర్మించిన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని చెప్పింది. 
 
మరోవైపు.. డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్‌లో తలదాచుకుందన్న వార్తలు అవాస్తవమని ఆ దేశ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్పష్టం చేసింది. ఆమె కదలికలపై గతంలో తామిచ్చిన సమాచారం అవాస్తవమని నేపాల్ సీబీఐ డైరెక్టర్ పుష్కర్ కార్కి వెల్లడించారు. కొంతమంది భీరత్ నగర్ పరిసరాల్లో ఆమెను చూసినట్టు సమాచారం ఇచ్చారు. మరికొందరు పశ్చిమ నేపాల్‌లో చూసినట్టు తెలిపారు.